తల నీలాల వసూళ్లకు వేలం..!
అన్నమయ్య: బ్రహ్మంగారి మఠంలోని ఈశ్వరి దేవి మఠంలో భక్తులు సమర్పించే తలనీలాల వసూళ్ల హక్కు కోసం సోమవారం 3 గంటలకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఈవో జగన్మోహన్ రెడ్డి ఆదివారం తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.25,000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. హక్కు పొందినవారు వెంటనే మూడో వంతు సొమ్మును చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.