తాడ్వాయి నుంచి ప్రైవేట్ వాహనాలు బంద్

తాడ్వాయి నుంచి ప్రైవేట్ వాహనాలు బంద్

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మండల కేంద్రం నుంచి సమ్మక్క, సారలమ్మ ఆర్చీ నుంచి చాలా మంది భక్తులు బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తరలి వస్తుంటారు. ఇందులో భాగంగా తాడ్వాయి నుంచి వెళ్లే ప్రైవేట్ వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు.