కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం: కేసీఆర్
TG: తెలంగాణ కోసం తాను బయలుదేరితే ఎంతోమంది అవహేళనలు చేశారని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో దీక్ష చేపట్టానన్నారు. ఆ తర్వాత కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇచ్చిందని.. కానీ ఆంధ్రా నాయకుల రాజీనామాల డ్రామాతో మళ్లీ వెనక్కి తగ్గిందన్నారు. దాని తర్వాత జేఏసీ ఏర్పాటు చేసి.. మళ్లీ ఉద్యమిస్తే.. చచ్చుకుంటూ తెలంగాణ ఇచ్చిందన్నారు.