సీపీఐలో పలువురు మహిళలు చేరిక
MNCL: మంచిర్యాలకు చెందిన పలువురు మహిళలు జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న ఆధ్వర్యంలో శనివారం సీపీఐలో చేరారు. ఈ సందర్భంగా వారికి సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సీపీఐ పట్టణ కార్యదర్శి ఖళీందర్ ఆలీ ఖాన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారపల్లి రవి, యోసేఫ్ పాల్గొన్నారు.