మహబూబాబాద్ లో భారీ ర్యాలీ

MHBD: పాక్ పై భారత సైన్యం దాడి చేసిన సందర్భంగా మహబూబాబాద్‌లో బుధవారం రాత్రి భారీ ర్యాలీ తీశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం నిర్వహించిన సైనిక వైమానిక దాడులను స్వాగతిస్తున్నామన్నారు. కల్నల్ సోఫియా ఖురేషి అనే ఓ మహిళ నాయకత్వంలో పాకిస్తాన్పై దాడి చెయ్యడం ప్రాధాన్యతను సంతరించుకుందని హర్షం వ్యక్తం చేశారు.