'ఫోన్ పోయిందా.. ఇలా చేయండి'

'ఫోన్ పోయిందా.. ఇలా చేయండి'

కృష్ణా: కొంత కాలంగా జిల్లాలో సెల్ ఫోన్‌లు చోరీకి గురవుతున్నాయి. అయితే ఫోన్ పోగొట్టుకున్నప్పుడు వెంటనే www.ceir.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే తిరిగి వస్తుందని అధికారులు చెబుతున్నారు. మొదటగా పోర్టల్‌లో మీ ఫోన్ వివరాలు నమోదు చేయాలి. ఇలా చేయడం వలన దొంగలించినవారు వేరే వాళ్లకు అమ్మినా, ఇంకొక సిమ్ వేసినా పోలీసులకు వివరాలు అందుతాయి. ఆ సమాచారంతో ఈజీగా పట్టేస్తారు.