CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి స్వామి

CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి స్వామి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి గురువారం CMRF చెక్కులను పంపిణీ చేశారు. 121 మంది లబ్ధిదారులకు రూ.60.76 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.5.73 కోట్ల CMRF నిధులను అనారోగ్య బాధితులకు పంపిణీ చేశామన్నారు.