VIDEO: చెంబకూరు బస్టాండ్‌లోకి దారి తప్పి వచ్చిన జింక

VIDEO: చెంబకూరు బస్టాండ్‌లోకి దారి తప్పి వచ్చిన జింక

అన్నమయ్య: రామసముద్రం మండలం చెంబకూరు బస్టాండ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సమీప కొండ ప్రాంతం నుంచి గ్రామంలోకి ప్రవేశించిన ఓ జింకను కుక్కలు వెంటాడడంతో భయంతో అది సమీపంలోని దుకాణంలోకి పరుగెత్తి దాక్కుంది. గ్రామస్తులు అప్రమత్తంగా వ్యవహరించి జింకను సురక్షితంగా పట్టుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. జింకను అధికారులు అడవిలోకి సురక్షితంగా వదిలిపెట్టారు.