నడవలేని స్థితి.. ఓటేసిన వృద్దుడు
సూర్యాపేట్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా, ఆత్మకూర(M) మండలం కందగట్లలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడు... వీల్ చైర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చి, తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయోభారం ఉన్నా, ఆయన చూపిన ఈ స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయం.