VIDEO: పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ
AKP: నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇవాళ మహిళల భద్రతపై విద్యార్థినిలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళల భద్రత పట్ల పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ షేక్ గఫూర్, రూరల్ సీఐ రేవతమ్మ పాల్గొన్నారు.