వృద్ధాశ్రమంలో అల్పాహారం పంపిణీ
TPT: ఎర్పేడు మండలం సరస్వతి కండ్రిగ గ్రామంలో యువ నేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఆదివారం అల్పాహారం పంపిణీ చేశారు. లోకేష్, భాను దంపతులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. యువ నేస్తం అసోసియేషన్ వ్యవస్థాపకుడు మునిశేఖర్ మాట్లాడుతూ.. ఎవ్వరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.