వైసీపీ నుంచి టీడీపీలోకి అరకు ఎంపీటీసీ వరహాలమ్మ
ASR: డుంబ్రిగూడ మండలంలోని అరకు పంచాయితీ వైసీపీ ఎంపీటీసీ వరహాలమ్మ, నాగేశ్ దంపతులు టీడీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా నియోజవర్గ ఇంఛార్జ్, ఆర్టీసీ విజయనగరం రీజినల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధితో ఆకర్షితులై టీడీపీలో చేరామని వారు పేర్కొన్నారు.