5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్రప్రసాద్ గెలుపు
KMM: ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన జోరును ప్రదర్శించింది. పెద్దతండా పరిధిలోని 5వ వార్డు నుంచి ఆ పార్టీ అభ్యర్థి బానోత్ నాగేంద్రప్రసాద్ తన సమీప ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించారు. గిరిజన ఓటర్ల మద్దతుతో ఆయన ఆది నుంచీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. నాగేంద్రప్రసాద్ విజయం ఖరారు కావడంతో పెద్దతండాలో పండుగ వాతావరణం నెలకొంది.