'విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలి'
AKP: విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఎలమంచిలి మండలం పెద్దపల్లి జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక జడ్పీ హైస్కూల్లో ఆకర్ష్ ఖేల్ కూద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వారికి వివరించారు.