VIDEO: అక్రమ ఇసుక రవాణా.. నాలుగు ట్రాక్టర్లు సీజ్
HNK: కమలాపూర్ మండల కేంద్రంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు ట్రాక్టర్లు పట్టుబడగా వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ పులి రమేష్ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ఎవరు ఇసుకను తరలించినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.