కదిరిలో కుమారుడిని చంపిన తండ్రి

కదిరిలో కుమారుడిని చంపిన తండ్రి

సత్యసాయి: కదిరిలో దారుణం జరిగింది. నిత్యం మద్యం తాగి తల్లిదండ్రులతో గొడవ పడుతున్న గణేశ్ (26) అనే యువకుడిని తండ్రి నారాయణ స్వామి హత్య చేశాడు. బుధవారం అర్ధరాత్రి కూడా గణేశ్ గొడవ చేయడంతో విసిగిపోయిన తండ్రి రోకలి బండతో కొట్టాడు. దీంతో గణేశ్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.