క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్
WNP: క్షయ వ్యాధికి మందులు ఉన్నాయని, ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే క్షయ వ్యాధి పూర్తిగా నయమై పోతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ చేతుల మీదుగా క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్‌లను అందజేశారు.