చైనా మాంజాతో ప్రాణహాని కలిగితే హత్య కేసు: సీపీ

చైనా మాంజాతో ప్రాణహాని కలిగితే హత్య కేసు: సీపీ

NZB: చైనా మాంజాతో వ్యక్తులకు ప్రాణహాని జరిగితే హత్యానేరం కేసు నమోదు చేస్తామని CP సాయిచైతన్య ఆదివారం హెచ్చరించారు. చైనా మాంజా వాడటం ప్రమాదకరమని ప్రజలు, జంతువులు, పక్షులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. చైనా మాంజా నిల్వ ఉంచినా, తయారు చేసి విక్రయించినా, ప్రోత్సహించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.