'కలాం చూసిన బాటలో యువత ముందుకు సాగాలి'

NTR: క్షిపణి శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రతి యువకుడూ కలాం కలలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలన్నారు.