పరువు హత్య కేసులో పోలీసుల హస్తం.!
PLD: ప్రేమపెళ్లి చేసుకున్న చౌడేశ్వరి(23)ని ఆమె తండ్రి హత్య చేసిన ఘటన మచర్లలో జరిగిన తెలిసిందే. కాగా, ఈ కేసులో ఓ పోలీసు నిందితులకు సహకరించినట్లు విచారణలో తేలింది. చౌడేశ్వరి ఆచూకీ కనిపెట్టి ఆమె తండ్రికి అప్పగించేందుకు ఆ అధికారి భారీ మొత్తంలో నగదు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేసే ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.