'జీవోల అమలులో పొరపాట్లు ఉండకూడదు'
VSP: వైద్య విద్య విభాగంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలులో ఎటువంటి పొరపాట్లకు తావు ఉండరాదని శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్ తోట త్రిమూర్తులు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కమిటీ సభ్యులతో కలిసి హెచ్.ఐ.వి/ఎయిడ్స్ నివారణ చట్టం-2017 అమలుపై సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్యం, మందులు ఉపాధి అవకాశాలను అడిగి తెలుసుకున్నారు.