కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ
TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిరోజు 3,242 సర్పంచ్, 1,821 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ రెండో రోజు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. 30న నామినేషన్లను పరిశీలిస్తారు. డిసెంబర్ 3 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. తొలి దశలో 4,236 గ్రామాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నారు.