ఈదురుగాలులు దాటికి నేలకొరిగిన అరటిపంట

ఈదురుగాలులు దాటికి నేలకొరిగిన అరటిపంట

PPM: తుఫాను ప్రభావంతో గురువారం భారీగా వీచిన ఈదురుగాలుల దాటికి వీరఘట్టం మండలంలో అరటిపంటకు భారీగా నష్టం వాటిల్లింది. మండలంలోని కంబర, చిట్టపులివలస, కంబరవలస గ్రామాల్లో సుమారు 750 ఎకరాల్లో అరటి తోటలు నేలమట్టమయ్యాయి. హుదూద్ తుఫాన్ తలపించే విధంగా ఈదురుగాలులు వీచాయని రైతులు శుక్రవారం వాపోయారు. ఉద్యానవనశాఖ అధికారులు పంట నష్టాన్ని పరిశీలించాలని రైతులు అన్నారు.