'విశాఖ ఉత్సవ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు'
VSP: ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా, ప్రజలకు ఆకర్షణీయంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య, అగ్నిమాపక ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.