చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

కడప: ప్రొద్దుటూరు పట్టణంలో వరుస దొంగతనాలపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్పందించారు. రాత్రి వేళల్లో పోలీసులతో నిఘా పెంచాలని జిల్లా ఎస్పీని కోరినట్లు చెప్పారు. త్వరలోనే చోరీ సొమ్ము రికవరీకి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారని అన్నారు. అలాగే ప్రజలు మరో ప్రాంతానికి వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు.