ఐదేళ్లలో జగన్ ఎన్నో సంస్కరణలు చేశారు: పెద్దిరెడ్డి
AP: ఐదేళ్లలో జగన్ ఎన్నో సంస్కరణలు చేశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రజలకు గుర్తుండిపోయేలా సంక్షేమం అందించారని గుర్తు చేశారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ద్వారా.. ఇప్పటికే మొదటి బ్యాచ్ పూర్తి అయ్యేదని పేర్కొన్నారు.