అరుణాచలంకు ప్రత్యేక బస్సు ఏర్పాటు

అరుణాచలంకు ప్రత్యేక బస్సు ఏర్పాటు

PLD: సత్తెనపల్లి ఆర్టీసీ డిపో నుండి అరుణాచలం కు ఈ నెల 10న రాత్రి 9 గంటలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ కుమార్ తెలిపారు. ఈ నెల 11న శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ తదితర ప్రదేశాలు సందర్శించి అదే రోజు రాత్రికి అరుణాచలం చేరుకుంటుందని అన్నారు. తిరిగి ఈ నెల 12న కంచి దర్శనం అనంతరం, 13 న తిరిగి సత్తెనపల్లి వస్తుందని తెలిపారు.