వ్యవసాయ మార్కెట్​ను ముట్టడించిన రైతులు

వ్యవసాయ మార్కెట్​ను ముట్టడించిన రైతులు

NZB: నగరంలోని వ్యవసాయ మార్కెట్​ను రైతులు బుధవారం ముట్టడించారు. ఈ మేరకు పసుపు కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ వారు అధికారులను ఘెరావ్​ చేశారు. సుమారు 50 వేలకు పైగా పసుపు యార్డు​లో డంప్​ అయ్యిందని రైతులు అవేదన వ్యక్తం చేశారు. అయితే ఆన్​లైన్​లో రూ.16 వేలు క్వింటాల్​ ధర ఉండగా.. మార్కెట్​లో ఆఫ్​లైన్​లో మాత్రం రూ. 13 వేలకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.