సూర్యాపేటలో నేడు విద్యుత్ నిలిపివేత

సూర్యాపేటలో నేడు విద్యుత్ నిలిపివేత

సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్టుకొమ్మల తొలగింపు పనుల కారణంగా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సురేష్ ఈరోజు సాయంత్రం తెలిపారు. విజయ్ కాలనీ, శాంతి నగర్, ఇండస్ట్రియల్ ఏరియా, బలరాం తండా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.