VIDEO: అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
ADB: ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన, వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కారమయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి పాల్గొన్నారు.