పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
VZM: పూసపాటిరేగ మండలం కనిమెళ్లలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, అర్హులైన ప్రతి రైతుకు పారదర్శకంగా పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.