జూడో పోటీల్లో బీబీనగర్ విద్యార్థుల ప్రతిభ

జూడో పోటీల్లో బీబీనగర్ విద్యార్థుల ప్రతిభ

BHNG: ఉమ్మడి నల్గొండ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-17 జూడో పోటీల్లో బీబీనగర్ విద్యార్థులు సత్తా చాటారు. బాలికల విభాగంలో భవిష్య, హెబా కమ్రిన్, బాలుర విభాగంలో కౌశిక్, విద్య చరణ్, వర్షిత్, చరణ్ తేజ, అభిత్లు స్వర్ణ పతకాలు సాధించారు. విజేతలను జూడో సంఘం జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి బ్రహ్మం తదితరులు అభినందించారు.