అన్నదాతలు పోస్టు కార్డు ఉద్యమం

మంచిర్యాల: చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో రైతులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రైతులు పోస్టు కార్డు ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాశారు. వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు భరోసాకి 15 వేలు, రైతు రుణమాఫీ 2 లక్షలు, వర్షాలు రాక ఎండిపోయిన పంట పొలాలకు అందిస్తామన్నారు.