జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే
CTR: మాజీ భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించుకున్నారు. అనంతరం జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.