దైవ లోకాన్ని తలపిస్తున్న పుట్టపర్తి
సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల సందర్భంగా పుట్టపర్తి దైవ లోకాన్ని తలపిస్తోంది. పట్టణం మొత్తం ఎటు చూసినా రంగు రంగుల తోరణాలు, భారీ కటౌట్లతో శోభాయామానంగా మారింది. ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఈ అలంకరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.