VIDEO: 'క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి'
KMM: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని సర్పంచ్ ఆళ్ళ మనీ పానకాలరావు అన్నారు. ఆదివారం చింతకాని మండలం సీతంపేటలో జరిగిన కబడ్డీ క్రీడ ఫైనల్ పోటీలను సర్పంచ్ ప్రారంభించారు. క్రీడల్లో యువత రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ క్రీడాకారులను పరిచయం చేసుకొని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.