ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన MLA సతీమణి

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన MLA సతీమణి

MBNR: అడ్డాకల్ మండల కేంద్రంలో దాసరి రాములమ్మ ఉత్తన్న ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత పాల్గొని ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసి, సొంతింటి కల నెరవేర్చిన ఎమ్మెల్యేకు లబ్ధిదారుడు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తమ కుటుంబం తరపున నూతన వస్త్రాలు అందజేశారు.