రీసర్వే పనులపై కలెక్టర్‌ శ్యామ్ ప్రసాద్‌ సమీక్ష

రీసర్వే పనులపై కలెక్టర్‌ శ్యామ్ ప్రసాద్‌ సమీక్ష

సత్యసాయి: బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే పనులను కలెక్టర్‌ శ్యామ్ ప్రసాద్‌ ఇవాళ సమీక్షించారు. సర్వే నోటీసులు, ఫీల్డ్‌ వెరిఫికేషన్ వివరాలను రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. భూమి రికార్డుల్లో వ్యత్యాసాలుంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు ప్రత్యేక LPM (Land Parcel Map) ఇవ్వాలని సూచించారు.