మూడో రోజు కొనసాగుతున్న నిర్వాసితుల దీక్ష
E.G: గోకవరం మండల కేంద్రంలో గంగాలమ్మ గుడి వద్ద పోలవరం నిర్వాసితులు చేపట్టిన దీక్ష శుక్రవారం మూడవ రోజుకు చేరుకుంది. దేవీపట్నం గ్రామానికి చెందిన 120 మంది లబ్ధిదారులకు గృహాలు త్వరగా పూర్తి చేయాలని, అలాగే రోడ్లు వేసి, వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ప్రస్తుతం నివాసముంటున్న ఇళ్లకు అద్దెలు కట్టలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.