లచ్చగూడెం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్య
BDK: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామంలో చోటు చేసుకుందని స్థానికులు ఇవాళ తెలిపారు. లచ్చగూడెంకు చెందిన అంజలికి అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే వ్యక్తితో ఆరు నెలల క్రితం వివాహమైంది. భర్త సాఫ్ట్‌వేరు ఉద్యోగం చేస్తుండగా అంజలి అత్తమామల వద్ద ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.