కనీస సౌకర్యాలు మెరుగుపరచాలి: ఎంపీడీవో
SRD: సిర్గాపూర్ మండలంలోని 226 పోలింగ్ బూతుల్లో కనీస సౌకర్యాలు మెరుగు పరచాలని MPDO శారద అన్నారు. గురువారం GP కార్యదర్శులకు సమావేశ పరిచి సమీక్షించారు. పోలింగ్ బూత్‌లో కరెంటు, నీళ్లు, ఫర్నిచర్, బాత్రూం, ర్యాంపు, వీల్చైర్ తదితర సౌకర్యాలు సిద్ధం చేయాలని చెప్పారు. మూడో విడతలో మండలంలోని 28 జీపీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.