పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు
కోనసీమ: అమలాపురం మండలం భట్నవిల్లి బైర్రాజు ఫౌండేషన్ దగ్గరలో ఆదివారం కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. పెళ్ళికి వెళ్ళి వస్తుండగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. స్థానికులు వెంటనే గమనించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.