ప్రజా పాలన సన్నాహక సభలో పాల్గొన్న ఎమ్మెల్యే
KMM: ఉమ్మడి జిల్లాలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' అమలుపై నిర్వహించిన కీలక సన్నాహక సమావేశానికి వైరా శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణను వైరా నియోజకవర్గంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.