డేటా డ్రైవెన్ గవర్నెన్స్‌పై సమీక్ష నిర్వహించనున్న సీఎం

డేటా డ్రైవెన్ గవర్నెన్స్‌పై సమీక్ష నిర్వహించనున్న సీఎం

GNTR: సీఎం చంద్రబాబు లండన్ పర్యటన ముగిసింది. దీంతో ఆయన నిన్న రాత్రి లండన్ నుంచి స్వదేశానికి తిరిగి బయలుదేరారు. ఇవాళ ఉదయం HYD విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అమరావతికి చేరుకున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో డేటా డ్రైవెన్ గవర్నెన్స్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.