నేడు పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

HYD: జాతీయ చేనేత దినోత్సవం గురువారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో జరగనుంది. ఈ సందర్భంగా చేనేత వస్త్ర ప్రదర్శనను చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే సభలో 33 మంది చేనేత కార్మికులు, డిజైనర్లకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలు-2025 ప్రదానం చేస్తారు.