'ఏఎస్సై కుటుంబానికి రూ. లక్ష చెక్కు అందజేత'
SKLM: మెలియాపుట్టి స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సై బి. అప్పన్న ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు అసోసియేషన్ కార్యవర్గ అధ్యక్షుడు ఆర్. కృష్ణం నాయుడు గురువారం డెత్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ. లక్ష చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన మృతి పట్ల జిల్లా పోలీసు అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేశారు.