'ఈనెల 30లోగా దరఖాస్తులు పూర్తి చేయండి'
ELR: ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన పథకం కింద అర్హులైన ప్రతి పేదవాడు లబ్దిపొందేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆదేశించారు. ఇంతవరకు 29,187 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 7,781 మంది వివరాలు సర్వే చేశామని తెలిపారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.