కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా

కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా

VZM: కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు శుక్రవారం ధర్నాను చేపట్టారు. ఈ మేరకు 2019 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. అలాగే ఎఫ్.ఆర్.ఎస్‌ను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి పైడిరాజు, ఎస్.అనసూయ, గౌరవ అధ్యక్షురాలు వి.లక్ష్మి పాల్గొన్నారు.