సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటుకు వినతి
PDPL: గోదావరిఖనిలో సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ కలెక్టర్‌ను కోరారు. లైబ్రరీ నిర్మాణం కోసం రూ.60 లక్షలు కేటాయించినా అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు ఆగిపోయాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. యువతకు విద్యావకాశాలు మెరుగుపరిచేందుకు లైబ్రరీ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.