నీటి సమస్యకు పరిష్కారం

నీటి సమస్యకు పరిష్కారం

SKLM: కంచిలి మండలం పెద్ద పాత్రపడ గ్రామంలో చాలా రోజుల నుంచి ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య గురించి వారం రోజుల క్రితం కంచిలి టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు సమక్షంలో MLA అశోక్ బాబుకి తెలియజేశారు. సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి పనులు చేపట్టి సమస్య పరిష్కరించారు. దీంతో బుధవారం ఎమ్మెల్యే అశోక్ బాబును కలసి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.